లోక కళ్యాణార్థం శ్రీ వేద త్రిపుర పీఠం ఆధ్వర్యంలో పూజలు
మల్హర్ , జూలై 21: (చక్రవాణి న్యూస్) మండల పరిధిలోని గాదంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ హనుమాన్ సహిత శివపంచాయతన సుబ్రహ్మణ్యేశ్వర దత్తాత్రేయ వారాహీ దేవి ఆలయంలో మంగళవారం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వారాహీ నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ వేద త్రిపుర పీఠం గురువర్యులు శ్రీ మోతే విశ్వనాథం, శిష్య బృందం లోకే రాము ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ విశేష పూజలు జరిగాయి. హోమం అనంతరం భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వేద త్రిపుర పీఠం సభ్యులకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

0 Comments